వరుసగా రెండోరోజూ తగ్గిన వెండి, బంగారం ధరలు
- ఎంసీఎక్స్‌లో అతి స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- దేశ రాజధాని ఢిల్లీలో 22 కేరెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 60,900, వెండి కిలో రూ. 75,600
- చెన్నైలో మాత్రం 10 గ్రాముల బంగారం రూ. 61,500, వెండి ఏకంగా రూ. 79 వేలు
మే 3తో ముగిసే సిల్వర్ ఫీచర్స్‌లో వెండి ధర రూ. 77 (0.10శాతం) తగ్గి కిలో రూ. 74,185గా నమోదైంది. అంతకుముందు దాని ధర రూ. 74,262 వద్ద ముగిసింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 22 కేరెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,900గా ఉండగా, వెండి ధర కేజీ రూ. 75,600గా ఉంది. ముంబైలో వీటి ధరలు వరుసగా రూ. 60,750, రూ. 75,600, కోల్‌కతాలో రూ. 60,750, రూ. 75,600, చెన్నైలో రూ. 61,500, రూ. 79,000గా ఉన్నాయి.