కాంగ్రెస్ సభ వీడియో షేర్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
- సాక్షాత్తూ అసెంబ్లీలోనే కరెంట్ కట్ అయిందని వ్యంగ్యం
- అధికార పార్టీ మీటింగ్ లోనూ అదే పరిస్థితని వివరణ
- రైతుల గోసపై దృష్టి పెట్టాలని సీఎంకు చెప్పాలంటూ జీవన్ రెడ్డికి విజ్ఞప్తి
మీరే స్వయంగా ఫోన్ చేసినా కూడా కరెంటు రాలేదు. దీంతో మీకు ఎంత ఇబ్బంది కలిగిందో కనిపిస్తూనే ఉంది. మరి కరెంట్ పైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఇంకెంత ఇబ్బంది కలుగుతుందో మీకు అర్థమవుతోందా.. అంటూ జీవన్ రెడ్డిని కవిత ప్రశ్నించారు. కరెంట్ లేక పంటలు ఎండుతున్నాయని, అది చూసి రైతులు ఎంత ఆవేదన చెందుతున్నారో తెలుసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా మీరైనా కరెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి చెప్పండంటూ కవిత ట్వీట్ చేశారు. ప్రజల కరెంటు కష్టాలు పట్టనట్టు ప్రభుత్వం నటిస్తోందని మండిపడ్డారు. ప్రచారంపై పెట్టే శ్రద్ధ పాలనపైనా పెట్టాలని సీఎంకు సూచించాలని కోరారు.