Tiger: వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని గాయపడిన పెద్దపులి క్షేమం

  • నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు పరిధిలో ఘటన
  • బైక్ క్లచ్ వైరు లాంటిది చుట్టుకుని విలవిల్లాడిన మూడేళ్ల వయసున్న పెద్దపులి
  • ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించి రక్షించిన అటవీ అధికారులు
  • నాలుగు రోజుల చికిత్స అనంతరం కోలుకున్న పులి
Big Cat Who Injured In SriSailam Tiger Project Saved

వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని గాయపడిన పెద్దపులి క్షేమంగా తిరిగి అడవిలోకి చేరుకుంది. నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు పరిధిలో ఓ పెద్దపులి ఇటీవల వేటగాళ్ల ఉచ్చులో చిక్కి తీవ్రంగా గాయపడింది. మూడేళ్ల వయసున్న ఆడపులి నడుము భాగంలో బైక్ క్లచ్ వైర్ లాంటిది బిగుసుకుని గాయపడింది. 

ఫిబ్రవరి 25న ట్రాప్ కెమెరాల ద్వారా అటవీ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. పులి తీవ్రంగా గాయపడి ఇబ్బంది పడుతున్న విషయం నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ పులికి వెంటనే వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది.

పూణెకు చెందిన ఐదుగురితో కూడిన రెస్క్యూ బృందంతోపాటు అటవీశాఖ ఉద్యోగులు, ప్రొటెక్షన్‌ వాచర్లు కలిసి ఈ నెల 5న పులిని గుర్తించి మత్తుమందు ఇచ్చి బంధించారు. ఆపై బైర్లూటిలోని వన్యప్రాణి వైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. నాలుగు రోజుల తర్వాత పులి కోలుకోవడంతో శుక్రవారం రాత్రి దానిని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ విషయాన్ని అటవీ అధికారులు నిన్న వెల్లడించారు.

More Telugu News