ఉత్తర ప్రదేశ్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నాం... మాపై అసత్యపు ప్రచారం చేస్తున్నారు: మాయావతి
- ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పిన బీఎస్పీ అధినేత్రి
- తమ పార్టీ పొత్తుతో వెళుతుందని కొందరు అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
- ఉత్తర ప్రదేశ్లో బీఎస్పీ చాలా బలంగా ఉంది... ఒంటరిగా పోటీ చేస్తున్నామని స్పష్టీకరణ
మీడియా కూడా అవాస్తవాలతో కూడిన వార్తలను ప్రచారం చేసి విశ్వసనీయతను కోల్పోకూడదని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్లో బీఎస్పీ చాలా బలంగా ఉందని... తాము ఒంటరిగా పోటీ చేయడం చేస్తుంటే ఇతర పార్టీలు ఆందోళన చెందుతున్నాయని... అందుకే తమ పార్టీపై పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. బహుజన వర్గాల ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయించుకుందన్నారు.