చంచల్‌గూడ జైలును తరలిస్తాం: రేవంత్ రెడ్డి ప్రకటన
- చంచల్ గూడ జైలును విద్యా సంస్థగా మారుస్తామని రేవంత్ ప్రకటన
- మూసీ పరీవాహక ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్య
- తమకు ఎవరిపైనా కక్షలు లేవన్న ముఖ్యమంత్రి
2028 నాటికి పాతబస్తీ మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. హైదరాబాద్ లో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ పరీవాహక ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. తమకు ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు లేవని అన్నారు. అసెంబ్లీలో కేవలం ప్రజా సమస్యలపైనే పోరాడుతామని చెప్పారు. పాతబస్తీలో మెట్రో రైల్ శంకుస్థాపన కార్యక్రమంలో రేవంత్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ రేవంత్ పై ప్రశంసలు కురిపించారు. ఎంతో కష్టపడి రేవంత్ సీఎం స్థానానికి ఎదిగారని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం ఐదేళ్లు నిలబడుతుందని... అవసరమైతే తాము అండగా నిలబడతామని అన్నారు.