దేశంలోనే తొలిసారి.. వితంతువులు మళ్లీ పెళ్లాడితే రూ. 2 లక్షలు.. ప్రకటించిన ఝార్ఖండ్ ప్రభుత్వం
- భర్త మరణం తర్వాత సమాజంలో ఒంటరిగా మారుతున్న మహిళలు
- వితంతు పునర్వివాహం పట్ల ఈ పథకం సామాజిక అభిప్రాయాన్ని మారుస్తుందని భావన
- ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఈ పథకం నుంచి మినహాయింపు
- పునర్వివాహం తర్వాత ఏడాదిలోపు దరఖాస్తు చేసుకుంటే రూ. 2 లక్షలు
జీవిత భాగస్వామి మరణించిన తర్వాత మహిళలు సమాజంలో ఒంటరిగా, నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని, వారు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని అధికారి ఒకరు తెలిపారు. అలాంటి పెళ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందన్నారు. వితంతువుల్లో ఈ పథకం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని, మహిళల పునర్వివాహం పట్ల సామాజిక అభిప్రాయాన్ని మారుస్తుందని పేర్కొన్నారు.