పవన్ కల్యాణ్ భద్రతా సిబ్బందిని బెదిరిస్తున్నారు: నాదెండ్ల మనోహర్‌

Police are threatening Pawal Kalyan security says Nadendal Manohar
  • ఈ నెల 17న చిలకలూరిపేటలో భారీ సభ
  • 10 లక్షల మందితో సభను నిర్వహిస్తామన్న మనోహర్
  • జనసేన నేతల ఇళ్లలో పోలీసులు చొరబడటం దారుణమని వ్యాఖ్య
చిలకూలూరిపేటలో ఈ నెల 17న టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడితో కలిసి ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకున్నాయని చెప్పారు. ఇరు పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రెండు పార్టీల మధ్య తగాదాలు పెట్టాలని వైసీపీ నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. 10 లక్షల మందితో చిలకలూరిపేట సభను నిర్వహిస్తామని చెప్పారు. 

చిలకలూరిపేట సభలో అందరూ భాగస్వాములు కావాలని నాదెండ్ల కోరారు. వివిధ స్థాయుల్లో కమిటీలను ఏర్పాటు చేసి సభను విజయవంతం చేస్తామని చెప్పారు. జనసేనాని పవన్ కల్యాణ్ భద్రతా సిబ్బందిని, జనసేన టీమ్ లను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను పోలీసులతో భయపెట్టాలనే ప్రయత్నాలు సఫలం కావని అన్నారు. జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చొరబడటం దారుణమని చెప్పారు. సూపర్ నినాదంతో, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ, జనసేనలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. చిలకలూరిపేట సభలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు.
Go Back to Shorts
Nadendla Manohar
Janasena
Telugudesam

More Telugu News