Dubai Millionaire: నెల‌కు రూ.2.5 కోట్లు ఇస్తేనే బిడ్డ‌ను కంటాన‌ని భార్య వింత ష‌ర‌తు!

Dubai woman Demands Two Crore Monthly Allowance From Millionaire Hubby To Have Baby
  • ఉచితంగా పురిటి నొప్పులు భ‌రించ‌డం త‌న‌వ‌ల్ల కాదంటూ వాద‌న‌
  • గ‌ర్భం దాల్చ‌క‌ముందే భ‌ర్త‌తో ఒప్పందం కుదిరిందంటూ వెల్ల‌డి  
  • అలాగే పుట్టిన బిడ్డ అవ‌స‌రాల కోసం నెల‌కు అద‌నంగా మ‌రో రూ.2.50కోట్ల డిమాండ్‌ 
  • దుబాయి మిలియ‌నీర్ భార్య ష‌ర‌తుపై నెట్టింట చ‌ర్చ‌
దుబాయిలో ఉండే ఓ మిలియ‌నీర్ భార్య సౌదీ బిడ్డ‌ను క‌నేందుకు వింత ష‌ర‌తు పెట్టడం ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌కు దారితీసింది. త‌న‌కు నెల‌కు రూ.2.5 కోట్లు ఇస్తేనే త‌న భ‌ర్త‌తో బిడ్డ‌ను కంటాన‌ని ఆమె ప్ర‌క‌టించారు. ఉచితంగా తాను పురిటి నొప్పులు భ‌రించాల‌ని అనుకోవ‌ట్లేద‌ని నిర్మొహ‌మాటంగా చెబుతున్నారామె. తాను గ‌ర్భం దాల్చ‌క‌ముందే త‌న‌కు, త‌న భ‌ర్త‌కు దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింద‌ని ఆమె చెప్ప‌డం గ‌మనార్హం. అంతేకాదండోయ్, డెలివ‌రీ త‌ర్వాత పుట్టిన బిడ్డ‌ను చూసేందుకు క‌నీసం 1000 నుంచి 2000 మంది సంద‌ర్శ‌కులు వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున త‌న‌కు ప్ర‌త్యేక వీఐపీ గ‌దిని కూడా ఏర్పాటు చేయాల‌ని సౌదీ తన భ‌ర్త‌ను కోరారు. 

అలాగే పుట్టిన బిడ్డ అవ‌స‌రాల కోసం నెల‌కు అద‌నంగా మ‌రో రూ.2.50 కోట్లు ఇవ్వాల‌ని కోరింది. ఒక‌వేళ ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వాలంటే ఈ ధ‌ర రెట్టింపు అవుతుంద‌ని ఆమె త‌న భ‌ర్త‌కు ష‌ర‌తు పెట్టింది. అలాగే ఇంట్లో ప‌నివాళ్ల సంఖ్య‌ను రెట్టింపు చేయాల‌ని, ప్ర‌త్యేకంగా నైట్ న‌ర్స్‌ను నియ‌మించాల‌ని తెలిపింది. బిడ్డ కార‌ణంగా రాత్రుల్లో త‌న నిద్ర‌కు భంగం క‌ల‌గ‌కుండా ఆ న‌ర్సు ప‌ని చేస్తుంద‌ని పేర్కొంది.  పైగా భ‌ర్త సంపాద‌న‌ను ఖ‌ర్చు చేయ‌డ‌మంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని ఆమె చెప్పుకొచ్చారామె.
Dubai Millionaire
Wife
Monthly Allowance
Baby

More Telugu News