జగన్ ప్రభుత్వంపై మరోసారి వైఎస్ షర్మిల విసుర్లు
- రాజధానిగా చెప్పుకుంటూ విశాఖ ప్రజలను మూడేళ్లు దగా చేశారన్న షర్మిల
- వైజాగ్ స్టీల్‌ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించారని ధ్వజం
- పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అంటూ మండిపాటు
ఆంధ్రుల తలమానికమైన వైజాగ్ స్టీల్‌ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్ అంటూ దుయ్యబట్టారు. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్ అని షర్మిల ఫైర్ అయ్యారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు ఆడుతోందని అన్నారు.