కంటతడి పెట్టుకున్న మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య
- మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ సొరేన్
- భర్తను తలుచుకుని భావోద్వేగానికి గురైన కల్పన
- ప్రజా జీవితంలోకి అడుగు పెడుతున్నానని ప్రకటన
ప్రజా జీవితంలో అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నానని కల్పన చెప్పారు. ఝార్ఖండ్ ప్రజల కోరిక మేరకే తాను ప్రజా జీవితంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తన భర్త హేమంత్ సొరేన్ తిరిగి వచ్చేంత వరకు ఆయన ఆలోచనల మేరకు పని చేస్తానని, ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో జనవరి 31న హేమంత్ సొరేన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.