ఓల్డ్ సిటీలో మెట్రో రెండో దశ పనులకు 8న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓల్డ్ సిటీలో మెట్రో రెండో దశ పనులకు 8న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

CM Revanth Reddy to lay foundation for Old City metro rail at Falaknuma on March 8
  • ఫలక్‌నుమా నుంచి శాలిబండ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం మీదుగా ఎంజీబీఎస్ వరకు మార్గం
  • ఫలక్‌నుమా వద్ద పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న సీఎం
  • రూ.2000 కోట్ల ఖర్చుతో 5.5 కిలో మీటర్ల మేర మార్గం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 8న మెట్రో రైలు రెండో దశ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఫలక్‌నుమా నుంచి శాలిబండ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం మీదుగా ఎంజీబీఎస్ వరకు ఈ రూట్ ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులో ఉంది. మియాపూర్-ఎల్బీనగర్, రాయదుర్గం-నాగోల్, జూబ్లీ బస్ స్టేషన్-మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ మధ్య మెట్రో కారిడార్లు ఉన్నాయి.

ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న పాతబస్తీలోని ఫలక్‌నుమా వద్ద పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మార్గంలో ఐదు స్టేషన్లు వుంటాయి. మొత్తం 5.5 కిలోమీటర్ల మార్గంలో చేపట్టనున్న ఈ నిర్మాణానికి సుమారు రూ. 2000 కోట్ల వరకు ఖర్చు కానుంది.
Advertisement
metro
Revanth Reddy
Hyderabad
Congress

More Telugu News