Revanth Reddy: జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలపై అధ్యయనం చేయాలి: రేవంత్ రెడ్డి

  • అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశం
  • పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని సూచన
  • అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూడాలన్న సీఎం
Revanth Reddy asks officials about mobile anganwadi centres in ghmc

జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూడాలన్నారు. కేంద్రాలకు సొంత భవనాలు ఉండేలా చూసుకోవాలన్నారు.

More Telugu News