Hanuma Vihari: ఆ రోజు ఏం జరిగిందంటే...!: హనుమ విహారి వివరణ

  • ఆంధ్రా రంజీ జట్టులో వివాదం
  • ఓ ఆటగాడ్ని దూషించినట్టు హనుమ విహారిపై ఆరోపణలు
  • కెప్టెన్సీ కోల్పోయిన వైనం
Hanuma Vihari tells what happened in Andhra team dressing room

ఆంధ్రా రంజీ జట్టులో ఓ ఆటగాడిని దూషించిన ఆరోపణల కారణంగా కెప్టెన్సీ కోల్పోయిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారి ఆ వివాదంపై మరోసారి స్పందించాడు. అసలు  ఆ రోజు ఏం జరిగిందో హనుమ విహారి తాజాగా వెల్లడించాడు. ఆ ఆటగాడిని నేను అసభ్యంగా  దూషించినట్టు ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవానికి అక్కడ జరిగింది వేరు అని తెలిపాడు. 

"ఆ ఆటగాడు ఆంధ్రా రంజీ జట్టులో 17వ ఆటగాడిగా ఉన్నాడు. 17వ ఆటగాడి ఉన్న అతడు నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్ రూంలోకి రాకూడదు. ఈ విషయంలోనే నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. కానీ అతడు ఈ వ్యవహారాన్ని తప్పుగా మార్చేశాడు. అతడి తండ్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ఘటన అంతా నెగెటివ్ రంగు పులుముకుంది. 

ఇందులో నా తప్పేమీ లేదు... కానీ నన్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు. జట్టు కోసం నా వంతు సేవలు అందించేందుకు ఇన్నాళ్లు ఆగాను. ఇప్పుడు రంజీల్లో ఆంధ్రా తరఫున ఆడడం ముగిశాక... ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉందని ఈ విషయం వెల్లడిస్తున్నా... ఇప్పుడైనా నేను నా కోసం నిలబడాలి... లేకపోతే నాకు నేను సమాధానం చెప్పుకోలేను" అని హనుమ విహారి వివరించాడు.

More Telugu News