డ్రగ్స్ వ్యాపారి రిమాండ్ రిపోర్టుతో సినీ ఇండస్ట్రీలో కలకలం
- డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ తీసుకునే వాడని సయ్యద్ అబ్బాస్ అలీ వెల్లడి
- రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్
- వివేక్, క్రిష్, నిర్భయ్ సింధీలు కలిసి డ్రగ్స్ తీసుకున్నారని వివరణ
ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 24న రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్ పార్టీలోనూ క్రిష్ పాల్గొన్నాడని, శ్వేత, లిషి, నీల్ కూడా ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని అలీ చెప్పాడట. ఈ పార్టీకి సప్లై చేసిన డ్రగ్స్ ను మీర్జా వహీద్ బేగ్ నుంచి కొనుగోలు చేశానని, వాటిని వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్ కు అందజేశానని వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో గజ్జల వివేకానంద డ్రైవర్ ప్రవీణ్, డ్రగ్ సప్లయర్ మీర్జా వహీద్ ను చేర్చినట్లు పోలీసులు తెలిపారు.