న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ సెకండ్ షెడ్యూల్!
- మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా 'కన్నప్ప'
- న్యూజిలాండ్ లో మొదలైన సెకండ్ షెడ్యూల్
- కీలకమైన సన్నివేశాల చిత్రీకరణతో బిజీ
- పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిని రేపుతున్న ప్రాజెక్టు
ఈ మేరకు న్యూజిలాండ్‌లో దిగిన విష్ణు మంచు ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో మోహన్ బాబు, విష్ణు మంచు కనిపిస్తున్నారు. ఈ రెండో షెడ్యూల్లో ఒళ్లు గగుర్పొడిచే సీన్లను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. 'కన్నప్ప' సినిమాపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా 'కన్నప్ప' మూవీని తెరకెక్కిస్తున్నారు. న్యూజిలాండ్, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో, మోహన్ బాబు .. మోహన్ లాల్ .. ప్రభాస్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. 'మహా భారతం' సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు.