డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా మిషెల్ ఒబామాకు మొగ్గు!
- బైడెన్ కు సరైన ప్రత్యామ్నాయం ఆమేనంటున్న నేతలు
- పార్టీలో దాదాపు సగం మంది మద్దతు మిషెల్ కే.. అంతర్గత సర్వేలో వెల్లడి
- అధ్యక్ష అభ్యర్థిని మార్చాలంటున్న 48 శాతం డెమోక్రాట్లు
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బైడెన్ స్థానంలో మరో అభ్యర్థిని నిలబెట్టాలని డెమోక్రాటిక్ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేలో ఈ విషయం బయటపడింది. బైడెన్ కు సరైన ప్రత్యామ్నాయం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా అయితే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందట. డెమోక్రాట్లలో దాదాపు సగం (48 శాతం) మంది మిషెల్ ఒబామా అభ్యర్థిత్వంవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, తాను అధ్యక్ష పదవికి పోటీ పడాలన్న డిమాండ్లపై మిషెల్ ఒబామా గతంలోనే స్పందించారు.
అధ్యక్ష ఎన్నికలు జరిగిన ప్రతిసారీ తను పోటీలో ఉండాలని కోరే వారి సంఖ్య పెరుగుతోందని మిషెల్ చెప్పారు. ఈ ఎన్నికల సమయంలోనూ మరోసారి ఈ డిమాండ్ తెరపైకి వస్తుందని కిందటి నెలలోనే ఆమె అనుమానించారు. ఈ ప్రభుత్వం అసలు ఏదైనా పనిచేస్తోందా అని చాలా మంది ప్రజలు భావిస్తుంటారని, తాను మాత్రం ప్రభుత్వమే అన్నీ చేయాలా అని అనుకుంటానని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని తేలిగ్గా తీసుకోకూడదని మిషెల్ హితవు పలికారు.