రాంచీ టెస్టులో ఇంగ్లండ్ పట్టుకోల్పోయిన వేళ మాజీ దిగ్గజం మైఖేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఇంగ్లండ్ టీమ్ వైఫల్యానికి డీఆర్ఎస్ విధానం కారణం కాదన్న క్రికెట్ దిగ్గజం
- ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లు డీఆర్ఎస్ గురించి కాస్త ఎక్కువ మాట్లాడుతున్నారని విమర్శలు
- టెస్టులో రోజులు గడిచేకొద్దీ పట్టు కోల్పోతున్నారని విమర్శ
- ఇంగ్లండ్ క్రికెటర్లు దీనిపై ఆలోచన చేయాలని సూచన
‘‘ప్రస్తుత టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ టీమ్ డీఆర్ఎస్ విధానం గురించి కాస్త ఎక్కువగా మాట్లాడుతోందని నేను భావిస్తున్నాను. నిజమే కొన్ని నిర్ణయాలు తప్పుగా అనిపించాయి. స్క్రీన్‌పై పరిశీలించి చూస్తే ఈ విషయం అర్థమైంది. అయితే ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ వెనుకబడడానికి డీఆర్ఎస్ విధానం కారణం కాదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంగ్లండ్ జట్టు మ్యాచ్‌పై పట్టును కోల్పోతోంది. అలా ఎందుకు జరుగుతుందనే దానిపై జట్టు ఆలోచించుకోవాలి" అన్నాడు.
కాగా రాంచీ టెస్టుపై భారత్ పట్టుబిగించిన విషయం తెలిసింది. ఇంగ్లండ్‌ను సెకండ్ ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేయడంతో భారత విజయం లక్ష్యం 192 పరుగులుగా ఉంది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 40/0 పరుగులు చేసింది. దీంతో నాలుగవ రోజున 152 పరుగులు చేస్తే మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటుంది. సిరీస్‌ను 3-1 తేడాతో దక్కించుకుంటుంది.