పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించిన అంబటి రాంబాబు

Ambati Rambabu criticized Pawan Kalyan
  • తన సీటేదో తాను నిర్ణయించుకోలేనోడని విమర్శలు
  • ఇక జనానికి పవన్ ఏం చేస్తారన్న వైఎస్సార్‌సీపీ లీడర్
  • పవన్ కల్యాణ్‌పై కొనసాగుతున్న వైసీపీ నేతల విమర్శల దాడి
టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైన నాటినుంచి జనసేనాని పవన్ కల్యాణ్ టార్గెట్‌గా అధికార వైసీపీ నేతలు విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబు స్పందిస్తూ.. తన సీటేదో తానే నిర్ణయం చేసుకోలేనోడు పవన్ అని వ్యాఖ్యానించారు. ఇక పవన్ జనానికి ఏమి చేస్తారు, జనసైనికులకు ఏం చేస్తారు? అని అంబటి రాంబాబు విమర్శించారు. కాగా టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 24 స్థానాల్లో పోటీ చేయడం ఖరారైన విషయం తెలిసిందే. దీంతో తక్కువ సీట్లకే పరిమితమయ్యారంటూ జనసేనానిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Go Back to Shorts
Ambati Rambabu
YSRCP
Janasena
Andhra Pradesh

More Telugu News