Chinarajappa: ఏపీ మాజీ మంత్రి చినరాజప్ప కారుకు ప్రమాదం.. వీడియో ఇదిగో!

  • క్షేమంగా బయటపడ్డ టీడీపీ నేత చినరాజప్ప
  • టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో దక్కిన టికెట్
  • కార్యకర్తలు, అభిమానుల ర్యాలీలో ఘటన
AP Former Minister Chinarajappa Met With Car Accident

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి చినరాజప్ప క్షేమంగా బయటపడ్డారు. అనంతరం వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీడీపీ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మాజీ మంత్రి చినరాజప్పకు పెద్దాపురం టికెట్ దక్కింది. దీంతో ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు పెద్దాపురంలో ర్యాలీ నిర్వహించారు. చినరాజప్ప కారు బానెట్ పై గజమాల వేసి ఊరేగించారు. ఈ క్రమంలో దర్గా సెంటర్ వద్ద సడెన్ గా అడ్డువచ్చిన వ్యక్తిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో కారు ఆ పక్కనే ఉన్న డివైడర్ పైకెక్కింది. వెంటనే స్పందించిన కార్యకర్తలు చినరాజప్పను బయటకు తీశారు. ఆపై మరో కారులో చినరాజప్ప ఇంటికి వెళ్లిపోయారు.

More Telugu News