లాస్య నందిత ఘటన నేపథ్యంలో... వీఐపీల డ్రైవర్లందరికీ ఫిట్ నెస్ పరీక్షలు
- రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత
- మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల డ్రైవర్లకు టెస్టులు
- నైపుణ్యం లేని వారిని డ్రైవర్లుగా పెట్టుకోవద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రభుత్వం దీన్ని సుమోటోగా తీసుకుందని తెలిపారు. మొత్తం 33 జిల్లాల్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రముఖుల డ్రైవర్లకు ఫిట్ నెస్ టెస్టులు నిర్వహిస్తారని వివరించారు. డ్రైవింగ్ నైపుణ్యం లేని వారిని విధుల్లో పెట్టుకోవద్దని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ నేతలకు పొన్నం ప్రభాకర్ సూచించారు.