కాసేపట్లో టీడీపీ-జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్.. 65 మందితో తొలి జాబితా విడుదల చేసే అవకాశం
- ఉదయం 11.40 గంటలకు తొలి జాబితా విడుదల
- జాబితాలో 50 మంది టీడీపీ, 15 మంది జనసేన అభ్యర్థులు ఉండే అవకాశం
- చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్న సీనియర్ నేతలు
మరోవైపు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు తదితర సీనియర్ నేతలు ఇప్పటికే చేరుకున్నారు. కుప్పం నుంచి చంద్రబాబు, భీమవరం నుంచి పవన్ కల్యాణ్, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, మంగళగిరి నుంచి నారా లోకేశ్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్నారు. మరోవైపు తొలి జాబితా విడుదలవుతున్న నేపథ్యంలో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. పొత్తులో భాగంగా పలువురు టీడీపీ ముఖ్య నేతలకు టికెట్ దక్కకపోయే అవకాశం ఉంది.