నందమూరి మోక్షజ్ఞ నయా లుక్... అందుకేనా?
- బాలయ్య నట వారసుడి కోసం అభిమానుల ఎదురుచూపులు
- తాజాగా స్లిమ్ లుక్ తో ఉన్న మోక్షజ్ఞ ఫొటోలు వైరల్
- వెండితెర ఎంట్రీ కోసమేనంటూ అభిమానుల ఆనందోత్సాహాలు
తాజాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలకృష్ణ తనయుడి ఫొటోలు నందమూరి అభిమానుల ఆశలకు కొత్త రెక్కలు తొడుగుతున్నాయి. గతంలో కాస్తంత బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ లేటెస్ట్ ఫొటోల్లో స్లిమ్ లుక్ తో హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడు. వెండితెర అరంగేట్రం కోసమే మోక్షజ్ఞ బరువు తగ్గాడంటూ ఫ్యాన్స్ ఆనందోత్సాహల్లో తేలిపోతున్నారు.
