విమానం ఎక్కుతూ తూలి పడబోయిన బైడెన్.. వీడియో ఇదిగో!
- బైడెన్ వయసుపై మరోసారి చర్చ
- వృద్ధాప్యం కారణంగా మతిమరుపుతో బాధపడుతున్న అమెరికా ప్రెసిడెంట్
- అధ్యక్ష బాధ్యతలకు ఫిట్ కాదంటూ విమర్శలు
అధ్యక్షుడి ప్రయాణానికి ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ బైడెన్ తూలిపడబోయాడు. మెట్లపై పడిపోయే ప్రమాదాన్ని కొద్దిలో తప్పించుకున్నారు. ఆ వెంటనే మరోసారి తూలడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. విమానం ఎక్కేందుకు ఉపయోగించే మెట్లు చాలా చిన్నగా ఉంటాయని, అలాంటి మెట్లు ఎక్కడానికీ బైడెన్ తడబడ్డారంటే ఆయన ఫిట్ నెస్ పై అనుమానాలు రావడం సహజమేనని అంటున్నారు.
ఈ ఏడాది 82వ వసంతంలోకి అడుగుపెట్టనున్న బైడెన్.. వయసురీత్యా, మెమరీ పవర్ దృష్ట్యా అధ్యక్ష పదవికి అనర్హుడని రిపబ్లికన్ నేతలు ఆరోపిస్తున్నారు. అమెరికన్ పౌరులతో పాటు పలువురు సెనేటర్లు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా విమానం మెట్లు ఎక్కుతూ బైడెన్ తూలిపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బైడెన్ వయసుపై, ఆయన ఫిట్ నెస్ పై మరోసారి చర్చ జరుగుతోంది.