ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన ఆంధ్రా కుర్రాడు.. బీసీసీఐ అలెర్ట్.. వీడియో ఇదిగో!
- కల్నల్ సీకేనాయుడు ట్రోఫీలో చెలరేగిన ఆంధ్రా కుర్రాడు వంశీకృష్ణ
- కడపలో రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం
- 64 బంతుల్లో 110 పరుగులు చేసిన వంశీకృష్ణ
- వీడియోను పంచుకున్న బీసీసీఐ
1968లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడిన విండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్ గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాల్కమ్ నాష్ బౌలింగులో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా సౌతాఫ్రికా బ్యాటర్ హర్షలే గిబ్స్ పేరు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఇప్పుడీ జాబితాలోకి తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వంశీకృష్ణ వచ్చి చేరాడు.
అండర్-23 జాతీయ టోర్నీ అయిన కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో వంశీకృష్ణ ఈ ఘనత సాధించాడు. ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన బీసీసీఐ.. అలెర్ట్ అంటూ రాసుకొచ్చింది. కడపలో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ బౌలింగులో వంశీకృష్ణ ఆరు సిక్సర్లు బాదాడని పేర్కొంది. ఈ మ్యాచ్‌లో వంశీకృష్ణ 64 బంతుల్లోనే 110 పరుగులు చేసినట్టు పేర్కొంది.