లోక్ సభ ఎన్నికలపై ఈసీ కసరత్తు.. మార్చి రెండో వారంలో షెడ్యూల్!
- రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల సంసిద్ధతను పరిశీలించిన ఈసీ బృందాలు
- లోక్ సభతో పాటు జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
- మార్చి 8, 9 తేదీలలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈసీ బృందం భేటీ
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా కలిపి నిర్వహించే యోచన
సార్వత్రిక ఎన్నికల కసరత్తులో భాగంగా పలు రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో ఎన్నికల సంఘం అధికారులు సమావేశాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో మార్చి 8, 9 తేదీల్లో ఈసీ బృంద భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంసిద్ధతను పరిశీలించేందుకు మార్చి 12,13 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. గత లోక్ సభ ఎన్నికలకు 2019 మార్చి 10 న షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్తం ఏడు దశలలో పోలింగ్ నిర్వహించింది. మే 23న ఫలితాలను ప్రకటించింది.