2019లోనే చంద్రబాబు, లోకేశ్ కుర్చీలను మడతపెట్టేశాం: పేర్ని నాని

Perni Nani fires on Chandrababu and Nara Lokesh
  • షామియానా షాపుల్లో కుర్చీలను అద్దెకు తెచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదన్న పేర్ని నాని
  • చంద్రబాబుకు నిలువెల్లా మచ్చలే అని ఎద్దేవా
  • ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శ
2019 ఎన్నికల్లో చంద్రబాబు, నారా లోకేశ్ కుర్చీలను తాము మడతపెట్టేశామని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్ల కుర్చీలను మడతపెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామని చెప్పారు. ఊరూరా షామియానా షాపుల్లో కుర్చీలను అద్దెకు తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. మీ సభల్లో ఖాళీగా ఉన్న కుర్చీలను మడతపెట్టి ఎక్కడ పెట్టాలో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. గురివింద గింజకు ఒక్క మచ్చ మాత్రమే ఉంటుందని... కానీ, చంద్రబాబుకు నిలువెల్లా మచ్చలేనని విమర్శించారు. 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. జగన్ 99 శాతం హామీలను అమలు చేశారని కొనియాడారు. బందరు పోర్టును చంద్రబాబు పూర్తి చేయలేదని విమర్శించారు. హైదరాబాద్ నుంచి బందరుకు ఉద్యోగాలను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు.
Go Back to Shorts
Perni Nani
YSRCP
Jagan
Chandrababu
Nara Lokesh
Telugudesam
ap politics

More Telugu News