Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామ్ చరణ్ 'ఆర్‌సీ16' హీరోయిన్ గా జాన్వీ

Jahnavi kapoor is in Ramcharan Next Movie Rc 16
Advertisement
  • కన్ఫామ్ చేసిన జాన్వీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్
  • గేమ్ చేంజర్ సినిమా తర్వాత షూటింగ్ ప్రారంభం
  • ఇప్పటికే దేవర సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్
Advertisement
గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో బిజిబిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే తన కొత్త ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేశారు. 'ఆర్‌సీ16' పేరుతో కొత్త సినిమా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప్పెన సినిమా ఫేం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఇప్పటికే కథా చర్చలు, మ్యూజిక్‌ సిటింగ్స్ కూడా పూర్తయ్యాయని, ఏప్రిల్ నుంచి సెట్స్ మీదికి వెళ్లనుందని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటున్నారనే విషయంపై నిన్నటి వరకూ సస్పెన్స్ నెలకొంది. పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారంలో ఉన్నా వాటిని చిత్ర బృందం ధ్రువీకరించలేదు. తాజాగా ఈ సస్పెన్స్ తొలగిపోయింది.

రామ్ చరణ్ కొత్త సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనుందని సమాచారం. ఈ విషయాన్ని జాన్వీ కపూర్ తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కన్ఫామ్ చేశారు. రామ్‌చరణ్‌తో జాన్వీ కపూర్ కాంబినేషన్ పై చాలారోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా 'ఆర్‌సీ16' చిత్రంలో ఈ జంట కలిసి నటించనుందని కన్పామ్ అయింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీకపూర్ చెబుతూ 'రామ్ చరణ్ తో జాన్వీ నటించనున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుంది’ అని తెలిపారు. రామ్‌చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక.. అంటే ఏప్రిల్ నుంచి 'ఆర్‌సీ16' సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. కాగా, జాన్వీ కపూర్ కు తెలుగులో ఇది రెండవ సినిమా కానుంది. ఇప్పటికే ఆమె దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే!
Advertisement
Advertisement
Ramcharan
Jahnavi Kapoor
RC 16
New Movie
game changer
Entertainment
Boni kapoor

More Telugu News