మరో రెండు రోజుల్లో గుడ్ న్యూస్ తో మిమ్మల్ని కలుస్తా: కమలహాసన్
- డీఎంకేతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన కమల్
- ఈ ఎన్నికలు తమకు మంచి అవకాశమని వ్యాఖ్య
- ఎన్నికలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని వెల్లడి
డీఎంకే, ఎంఎన్ఎం పార్టీల పొత్తుపై గత సెప్టెంబర్ లోనే తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ హింట్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఎంఎన్ఎంతో పొత్తుపై పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మరోవైపు, సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఉదయనిధికి కమల్ మద్దతుగా నిలిచారు. 2018లో ఎంఎన్ఎం పార్టీని కమల్ స్థాపించారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలు, 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమిపాలయింది.