ఇండియా కూటమికి ఆ పేరే నాకు ఇష్టం లేదు: నితీశ్ కుమార్
- ఇండియా కూటమి నుంచి వైదొలగిన నితీశ్ కుమార్
- ఎన్డీయేలో చేరి బీహార్ లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ అధినేత
- ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందని వెల్లడి
తాజాగా నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందని, ఇప్పుడు దాని గురించి మాట్లాడడం అనవసరం అని పేర్కొన్నారు. ఇండియా కూటమికి ఆ పేరు పెట్టడమే తనకు ఇష్టం లేదని, మరో పేరు పెడదామని ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని అన్నారు. బీహార్ ప్రజల కోసమే తాను ఎన్డీయేలో చేరానని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.