yennam srinivas reddy: జగన్తో కలిసి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారు: కాంగ్రెస్ నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో కలిసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్తో కలిసి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కృష్ణా జలాలు దోపిడీ చేసేందుకు ఏపీ సీఎం జగన్కు సహకరించారన్నారు. జగన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది ఎవరు? అనే విషయం యావత్ తెలంగాణకు తెలుసునన్నారు.