19 ఏళ్ల వయసుకే మృతి చెందిన 'దంగల్' బాలనటి
- దంగల్ చిత్రంలో చిన్నప్పటి బబితగా నటించిన సుహానీ భట్నాగర్
- శనివారం ఉదయం కన్నుమూత
- మృతికి గల కారణాలపై స్పష్టత లేని వైనం
ఆమె వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు. ఈ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సుహానీ భట్నాగర్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. సుహానీ ఢిల్లీ శివారు ఫరీదాబాద్ లోని సెక్టార్-17లో నివాసం ఉంటోంది. ఆమె అంత్యక్రియలు అజ్రోండా శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.