'కుర్చీ'పై మేం కూడా అదే చెబుతున్నాం అంబటీ!: బుద్ధా వెంకన్న
- మీరు చొక్కాలు మడతేస్తే మేం కుర్చీ మడతపెడతామన్న లోకేశ్
- ఇక్కడున్నది సింహాసనం అంటూ అంబటి కౌంటర్
- సింహాసనం అయితే దాని మీదున్న శునకాన్ని తరిమేస్తామన్న బుద్ధా
ఇప్పుడు అంబటి రాంబాబు వ్యాఖ్యలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్ధా వెంకన్న స్పందించారు. "మేం కూడా అదే చెబుతున్నాం అంబటీ... కుర్చీ అయితే మడతపెడతాం... సింహాసనం అయితే... దాని మీదున్న శునకాన్ని తరిమేస్తాం... ఇది ఓకేనా?" అంటూ బుద్ధా చురక అంటించారు. వైసీపీ పనైపోయిందంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు.