త్వరలో టీడీపీ గూటికి లావు శ్రీకృష్ణదేవరాయలు!
ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు త్వరలో తెలుగు దేశం పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో గురువారం సాయంత్రం ఆయన భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. టీడీపీలో చేరికపై శ్రీకృష్ణదేవరాయలు చర్చించినట్టు తెలుస్తోంది. కాగా నరసరావుపేట లోక్‌సభ నుంచి ఈసారి మరో అభ్యర్థిని బరిలోకి దించాలని వైసీపీ అధిష్ఠానం యోచిస్తోంది. లావు శ్రీకృష్ణదేరాయలను పక్కన పెట్టాలని నిర్ణయించింది. దీంతో ఇటీవలే వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.