తనయుడితో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లిన ఎంపీ రఘురామకృష్ణరాజు

MP Raghurama Krishna Raju met Chiranjeevi
  • చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం
  • స్వయంగా చిరంజీవిని అభినందించిన రఘురామ
  • ఎక్స్ లో ఫొటోలు పంచుకున్న వైనం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు హైదరాబాదులో మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆయన వెంట కుమారుడు కనుమూరి భరత్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రఘురామ... చిరంజీవికి శాలువా కప్పి సన్మానించారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

దీనిపై రఘురామకృష్ణరాజు ఎక్స్ ద్వారా వెల్లడించారు. భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపికైన ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపాను అని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా చిరంజీవి పంచుకున్నారు.
Go Back to Shorts
Raghu Rama Krishna Raju
Chiranjeevi
Padma Vibhushan
Kanumuri Bharat
Hyderabad
Tollywood
Narasapuram

More Telugu News