యాదాద్రిపైకి ఆటోలకు అనుమతి
- ఆదివారం కొండపైకి ఆటోలను ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
- పాత కనుమదారి నుంచి రోజుకు 100 ఆటోలను అనుమతిస్తామని వెల్లడి
- కొండపై చలువ పందిళ్లు, తదితరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడి
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత కనుమదారి నుంచి రోజుకు 100 ఆటోలను అనుమతిస్తామని పేర్కొన్నారు. కొండపైన చలువ పందిళ్లు, డార్మిటరీ హాల్ ప్రారంభం, కొబ్బరి కాయలు కొట్టే స్థలం ఏర్పాటు తదితర అంశాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారన్నారు. నెలాఖరులోగా అవన్నీ ప్రారంభిస్తామని అన్నారు.