రేపు చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం
- ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు
- అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
- రేపు మధ్యాహ్నం సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు
ప్రభుత్వం తమకు రూ.6,700 కోట్లు బకాయిలు పడిందని, గత నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నాలుగు డీఏలు, సరెండర్ లీవులు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.