Hyderabad: అప్పుల బాధ.. మద్యానికి బానిస.. విషం తాగి ఇంటికి ఫోన్!

  • హైదరాబాద్‌లో ఘటన
  • ఇంటి నుంచి వచ్చి విషం తాగి పాదచారి సెల్‌తో సోదరుడికి ఫోన్
  • వచ్చిన సోదరుడితో ఆసుపత్రికి తీసుకెళ్లాలని వేడుకోలు
  • చికిత్స పొందుతూ మృతి
  • హైదరాబాద్‌లో ఘటన 
Man suicide after debt burden in Hyderabad

ఓ వైపు అప్పుల బాధ, మరో వైపు మద్యానికి బానిసైన ఓ వ్యక్తి డిప్రెషన్‌లోకి వెళ్లి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆపై ఇంటికి ఫోన్ చేసి తాను విషం తాగానని ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరాడు. ఆపై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీకి చెందిన రావూరి సునీల్ ప్రభాకర్ (40) గన్‌రాక్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలతో కలిసి స్థానిక స్కైలైన్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఇటీవల తరచూ విధులకు డుమ్మా కొడుతున్న ప్రభాకర్ ఈ నెల 7న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ బస్టాండ్ వద్ద ఓ పాదచారి ఫోన్ నుంచి సోదరుడికి ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ తీసుకుని పాదచారి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ నంబరుకు ప్రభాకర్ సోదరుడు తిరిగి ఫోన్ చేయడంతో పాదచారి విషయం చెప్పాడు. దీంతో వెంటనే అతడు ఖైరతాబాద్ బస్టాండ్ వద్దకు చేరుకున్నాడు. తాను విషం తాగానని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రభాకర్ చెప్పడంతో వెంటనే అతడిని మాసాబ్‌ట్యాంకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి దాటాక 2 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. నిన్న ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News