శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అపచారం... ప్రసాదంలో ఎముక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అపచారం... ప్రసాదంలో ఎముక

Bone found in Srisailam prasadam
  • శ్రీశైలం బ్రహ్మానందరాయ గోపురం వద్ద పులిహోర ప్రసాదం పంపిణీ
  • హరీశ్ రెడ్డి అనే భక్తుడికి పంపిణీ చేసిన ప్రసాదంలో ఎముక
  • అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసిన భక్తుడు
దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. శైవ భక్తులకు ఇది పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. అలాంటి దివ్య క్షేత్రంలో అపచారం చోటుచేసుకుంది. శ్రీశైలంలోని భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనుక ఉన్న బ్రహ్మానందరాయ గోపురం వద్ద పులిహోర ప్రసాదం పంపిణీ చేస్తుండగా, ప్రసాదంలోకి ఎముక వచ్చింది. హరీశ్ రెడ్డి అనే భక్తుడు తనకు పంపిణీ చేసిన ప్రసాదంలో ఎముకను చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా శ్రీశైలం దేవస్థానం అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.
Advertisement
Srisailam
Bone
Prasadam
Devotees

More Telugu News