దూరం పెడుతోందని.. పట్టపగలు అందరూ చూస్తుండగానే యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
- నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్‌లో ఘటన
- టైలరింగ్ షాపు నుంచి వస్తుండగా కత్తితో దాడిచేసిన నిందితుడు
- అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితురాలి మేనకోడలికి గాయాలు
మృతురాలు, నిందితుడు ఒకరికొకరు తెలుసునని పోలీసులు తెలిపారు. ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తుండడంతో ఆమె అతడికి దూరంగా ఉంటోంది. ఆమె తనను దూరం పెడుతుండడాన్ని జీర్ణించుకోలేకపోయిన నిందితుడు కాపుకాసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.