అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు
- హైదర్ గూడ వద్ద ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నేతలు
- ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్
- ప్లకార్డులతో అసెంబ్లీకి వచ్చిన నేతలను అడ్డుకున్న పోలీసులు
ప్లకార్డులను పట్టుకుని అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నల్ల కండువాలు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది సభలోకి అనుమతించలేదు. అయితే, కాసేపు వాగ్వాదం తర్వాత వారిని అనుమతించారు.