వైఎస్ షర్మిలకు భద్రత పెంపు
- తనకు భద్రత కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల
- టూ ప్లస్ టూకి భద్రత పెంచిన పోలీసులు
- డీజీపీ ఆదేశాల మేరకు భద్రతను పెంచామన్న ఎస్పీ
ఈ నేపథ్యంలో కడప జిల్లా పోలీసులు షర్మిలకు భద్రతను పెంచారు. ఈ విషయాన్ని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. షర్మిల అభ్యర్థన మేరకు ఆమె భద్రతను వన్ ప్లస్ వన్ నుంచి టూ ప్లస్ టూకి పెంచామని చెప్పారు. డీజీపీ ఆదేశాల మేరకు భద్రతను పెంచామని తెలిపారు. ఎవరి ప్రాణాలకైనా ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇస్తే... వారికి గన్ మెన్లను కేటాయిస్తామని చెప్పారు.