జైల్లో హేమంత్ సోరేన్.. పెళ్లి రోజు సందర్భంగా ఆయన భార్య కల్పన పోస్ట్
- ఈరోజు హేమంత్ సోరేన్, కల్పనల 18వ పెళ్లి రోజు
- ఈ ప్రత్యేకమైన రోజున ఆయన తమతో లేరన్న కల్పన
- కుట్రను ఛేదించి త్వరలోనే ఇంటికి వస్తారని ధీమా
హేమంత్ సోరేన్ ఎవరికీ తలవంచే వ్యక్తి కాదని కల్పన అన్నారు. ఝార్ఖండ్ గుర్తింపును సంరక్షించాలని ఆయన అనుకున్నారని చెప్పారు. తన భర్త గుండె ధైర్యం కలిగిన ఒక ఝార్ఖండ్ పోరాట యోధుడని అన్నారు. ఈరోజున తన భర్త తన పక్కన లేకపోయినా తాను అధైర్యపడనని చెప్పారు. హేమంత్ మాదిరే కష్ట సమయాల్లో తాను కూడా చిరునవ్వుతో ఉంటానని, ఆయనకు ఒక శక్తిగా నిలుస్తానని అన్నారు.