తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్ 1 లో మరో 60 పోస్టుల పెంపు
- గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆదేశాల జారీ
- కొత్తగా 60 పోస్టులు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- 563కు చేరిన గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య
2022 ఏప్రిల్‌లో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా... 2,80,000 మంది హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైనా... పేపర్ లీకేజీ కారణంగా ఆ పరీక్ష రద్దయింది. దీంతో 2023 జూన్‌లో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షల నిర్వహణలోని లోపాల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇంకోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఇంత వరకు వాదనలు జరగలేదు.