తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లో TS ను TGకి మార్చుకోవాలా?
- TS నుంచి TGకి మారనున్న వాహనాల రిజిస్ట్రేషన్
- జీవో తర్వాత వచ్చే కొత్త వాహనాలకు మాత్రమే వర్తిస్తుందంటోన్న అధికారులు
- రాష్ట్ర విభజన సమయంలో ఏపీ నుంచి టీఎస్‌కు మార్చుకోవాల్సిన అవసరం రాలేదని వివరణ
ప్రస్తుతం ఉన్న నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. జీవో ఇచ్చిన తర్వాత కొత్తగా వచ్చే వాహనాలకు మాత్రమే టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారని చెబుతున్నారు. గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలోనూ ఏపీ నుంచి టీఎస్‌గా మార్చుకోవాల్సిన అవసరం రాలేదని గుర్తు చేస్తున్నారు. అప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు యథావిధిగా కొనసాగాయని... ఇప్పుడూ అదే పద్ధతి కొనసాగవచ్చునని అంటున్నారు.