అందుకే నన్ను ట్రోల్ చేస్తున్నారు: సోహెల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే నన్ను ట్రోల్ చేస్తున్నారు: సోహెల్

Sohel Interview
  • బిగ్ బాస్ తో సోహెల్ కి గుర్తింపు 
  • సినిమాలతో ముందుకు వెళుతున్న తీరు 
  • బూట్ కట్ బాలరాజుకు లేని రెస్పాన్స్ 
  • ఆ విషయం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన హీరో 

గతంలో 'బిగ్ బాస్' ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోహెల్, ఆ తరువాత సినిమాలలో హీరోగా చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'బూట్ కట్ బాలరాజు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 2వ తేదీన ఈ సినిమా విడుదలైంది. తన సినిమా కొన్ని థియేటర్స్ లో కేన్సిల్ కావడం పట్ల సోహెల్ ఎమోషనల్ అయ్యాడు. అదే అతణ్ణి ట్రోల్ చేయదానికి అవకాశాన్ని ఇచ్చినట్టయింది. 

'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను ఈ సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడ్డాను. నాతో ఉంటే నేను పడిన కష్టాలను గురించి తెలిసేది. 'బిగ్ బాస్' హౌస్ లో ఉన్నప్పుడు ఆదరించారుగదా, అలాగే సినిమాల విషయంలోనూ సపోర్ట్ చేయమని అడిగాను. నా సినిమా చూడమని మీడియా ఎదురుగా ఎమోషనల్ అయ్యాను" అని అన్నాడు. 

"నేను అలా అనడంతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బిగ్ బాస్ వేరు .. సినిమా వేరు. కంటెంట్ ఉంటే మేమే సినిమా చూస్తాం కదా .. సినిమా చూడమని కెమెరా ముందు ఇలా అడుక్కోవడం ఎందుకు? అంటూ ట్రోల్ చేస్తున్నారు. సినిమాకి వెళితేనే గదా కంటెంట్ ఎలా ఉందనేది తెలిసేది అనేది నా అభిప్రాయం. నేను రివ్యూలు రాసేవారిని కూడా ఏమీ ఎనలేదు. ఒక వ్యక్తి థియేటర్లో కూర్చుని సినిమా చూస్తూనే రివ్యూ రాస్తుంటే అది కరెక్ట్ కాదని చెప్పానంతే" అని అన్నాడు.
Advertisement
Sohel
Actor
Bootcut Balaraju

More Telugu News