కేన్సర్‌ను జయించడంలో పురోగతి.. టీకాను అభివృద్ధి చేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు!
- కేన్సర్ భయాలు పెరుగుతున్న వేళ గుడ్‌న్యూస్
- కరోనా టీకా తయారీలో ఉపయోగించే ఎంఆర్ఎన్ఏ సాంకేతితతో కేన్సర్ టీకా అభివృద్ధి
- ట్రయల్స్‌లో మంచి ఫలితాలు
- కేన్సర్ చికిత్స గతిని మార్చనున్న టీకా
కరోనా టీకా తయారీలో ఉపయోగించే మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) సాంకేతికతను వాడి దీనిని అభివృద్ధి పరిచినట్టు వివరించారు. గ్లోబల్ ట్రయల్స్‌లో భాగంగా బ్రిటన్‌లో కేన్సర్ రోగులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి మంచి ఫలితాలు సాధించారు. ఈ మేరకు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఊపిరితిత్తులు, చర్మ కేన్సర్, ఇతర క్యాన్సర్లపై వ్యాక్సిన్ సామర్థ్యం, సురక్షితను అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఎంఆర్ఎన్ఏ-4539 పేరుతో పిలుస్తున్న ఈ కేన్సర్ టీకాను చర్మ కేన్సర్‌తో బాధపడుతున్న సర్రేకు చెందిన 81 ఏళ్ల వృద్ధుడిపై ప్రయోగించి సత్ఫలితాలు సాధించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రయోగ ఫలితాలు భవిష్యత్‌లో కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులకు కారణం అవుతాయని వివరించారు. ఈ కేన్సర్ టీకా కేన్సర్ రోగి శరీరంలోని సొంత రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడం వల్ల రక్షణ వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు.