23 ఎంఎంటీఎస్ సహా 51 రైళ్లు రద్దు.. ఫేజ్ 2 పనులే కారణం

Total 51 Trains Including MMTS Cancelled Today Onwards Says SCR GM
  • మౌలాలి - సనత్ నగర్ స్టేషన్ల మధ్య నాన్‌-ఇంటర్‌లాకింగ్‌ పనులు
  • ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు టైమ్ టేబుల్ వారీగా రద్దు
  • హైదరాబాద్ - కాగజ్ నగర్ రైలు కూడా..
హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ఫేజ్ - 2 పనుల కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మౌలాలి - సనత్ నగర్ మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ నెల 4 (ఆదివారం) నుంచి ఈ నెల 11 వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మొత్తం 51 రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు. ఈ రైళ్లను టైం టేబుల్ ప్రకారం రద్దు చేసినట్లు వివరించారు. వీటిలో ఈ నెల 9 వరకు మూడు ఎంఎంటీఎస్‌లు, 10వ తేదీ వరకు మరో రెండు, 11 వరకు 18 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు. వీటితో పాటు మౌలాలి - అమ్ముగూడ - సనత్ నగర్ మార్గంలో నడిచే హైదరాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, వికారాబాద్‌ - గుంటూరు, రేపల్లె - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ లను షెడ్యూల్ వారీగా ఆపేస్తామని వివరించారు. 

అందుబాటులోకి రానున్న మరో టెర్మినల్..
హైదరాబాద్ లోని చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టెర్మినల్ ఈ ఏడాది మార్చి చివరినాటికి సిద్ధమవుతుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం చెప్పారు. ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా సనత్‌నగర్‌ - మౌలాలి మధ్య రెండో లైను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ను బైపాస్‌ చేస్తూ కొన్ని రైళ్లను నడిపే అవకాశం కలుగుతుందని వివరించారు.
Go Back to Shorts
MMTS
Trains
Trains Calcelled
SCR
sirpur kagaznagar

More Telugu News