ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ
- తెలంగాణవ్యాప్తంగా 1.09 కోట్లకు పైగా వచ్చిన దరఖాస్తులు
- కొన్ని దరఖాస్తుల్లో తప్పులు ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- అర్హులైన దరఖాస్తుదారులు నష్టపోకుండా ఉండేందుకు పునఃపరిశీలించాలని సూచన
దరఖాస్తుల్లో 2.82 లక్షలను డూప్లికేట్‌గా గుర్తించారు. మరికొన్ని దరఖాస్తులలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్లు లేవు. దరఖాస్తుల్లో కొంతమంది నెంబర్లను తప్పుగా రాశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. ఇందులో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అర్హులైన దరఖాస్తుదారులు నష్టపోకుండా ఉండేందుకు వాటిని పునఃపరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.