తెలంగాణలో రేపటి నుంచి గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు
- తెలంగాణలో నేటితో ముగిసిన సర్పంచ్‌ల పదవీకాలం
- ప్రత్యేక అధికారులను నియమిస్తూ పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ
- తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018 సెక్షన్ 136 (3) కింద స్పెషల్ ఆఫీసర్ల నియామకం
ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018 సెక్షన్ 136 (3) కింద స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు జీవో జారీ అయింది. దీంతో రేపటి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.