ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్
- విపక్ష నేతగా తొలిసారి టీఎస్ అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్
- స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం
- హ్యాండ్ స్టిక్ సాయంతో ఎవరి సహాయం లేకుండా నడిచిన కేసీఆర్
ఇంకోవైపు, తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత కేసీఆర్ చాలా వరకు కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. హ్యాండ్ స్టిక్ ఆధారంగా, ఎవరి సహాయం లేకుండానే ఆయన నడిచారు. చాలా యాక్టివ్ గా కనిపించారు. ముఖ్యమంత్రిగా గత పదేళ్ల కాలంలో అసెంబ్లీ గేట్ నెంబర్ 1 ద్వారా రాకపోకలు సాగించిన కేసీఆర్... ఈరోజు గేట్ నెంబర్ 2 ద్వారా అసెంబ్లీకి రావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి విపక్ష నేతగా ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.